Mobile Popup Ad
Mobile Popup Ad

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సీఎం రేవంత్ శ్రీకారం

కలం, వెబ్ డెస్క్ : రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శ్రీకారం చుట్టారు. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కొఠారి కొత్త గూడలో పర్యటించిన సీఎం ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ ను ఆవిష్కరించారు. అలాగే రూ. 112.4 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మొదటి విడతలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా లబ్ధి దారుల కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అల్పాహారం తిన్నారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా గురించి తీసుకుంటున్న చర్యలను లబ్ధిదారులకు వివరించారు. ఆదిలాబాద్ లోని ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. జిల్లాలో నీటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ ను ఆదేశించామన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>