కలం, వరంగల్ బ్యూరో : ‘నాకు మరణం అంటూ వస్తే నేను నిర్మించిన సమ్మక్క – సారలమ్మ ఆలయం గుర్తొస్తుంది’ అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భావోద్వేగ భరింతంగా మాట్లాడారు. ఆదివారం సాయంత్రం మేడారం వచ్చిన సీఎం మంత్రులతో కలిసి జాతర పనులను పర్యవేక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తిరుపతి, కుంభమేళా స్థాయిలో ఇక్కడ నిత్యం వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు. జంపన్నవాగును మరింత అభివృద్ధి చేస్తామని, జంపన్నవాగులో శాశ్వతంగా నీరు ఉండేలా చూస్తామన్నారు.
సమ్మక్క సారలమ్మ చెంత మంత్రి వర్గ సమావేశం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వీరత్వమే దైవత్వంగా మారిన ప్రదేశం మేడారమని, కాకతీయులపై కత్తి దూసిన వీరవనితలు సమ్మక్క-సారలమ్మ ని కొనియాడారు. వారి స్ఫూర్తి తోనే ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర ఇక్కడ నుంచే ప్రారంభించానని చెప్పారు.
ఇచ్చిన మాట ప్రకారం సమ్మక్క సారలమ్మను దక్షిణాది కుంభమేళాగా తీర్చి దిద్దామని తెలిపారు. మంత్రులు సీతక్క – సురేఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులు జరిగాయని CM Revanth Reddy తెలిపారు.


