epaper
Monday, January 19, 2026
spot_img
epaper

వారం రోజుల్లో రూ.877 కోట్ల మద్యం తాగేశారు

కలం, వెబ్ డెస్క్: ఏపీలో సంక్రాంతి సందర్భంగా భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. కేవలం వారం రోజుల్లోనే రూ.877 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. జనవరి 9 నుంచి 16 దాకా ఈ అమ్మకాలు జరిగినట్టు అధికారులు వివరించారు. సాధారణ రోజుల్లో ఏపీ వ్యాప్తంగా రూ.85 కోట్ల అమ్మకాలు ప్రతిరోజూ జరిగేవి. కానీ సంక్రాంతి సందర్భంగా ఈ అమ్మకాలు డబుల్ అయ్యాయని ఆఫీసర్లు చెబుతున్నారు. పల్లెలు, పట్నాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో జోరుగా మద్యం అమ్మకాలు (Liquor Sales) జరిగినట్టు అధికారులు వివరించారు. ఈ సారి అమ్మకాలు గతంలో కంటే చాలా ఎక్కువగా జరిగినట్టు చెబుతున్నారు ఎక్సైజ్ శాఖ ఆఫీసర్లు.

Read Also: అమ్ముడుపోయిన వాళ్ల మ‌ధ్య ఉంటే అంతే సంగ‌తి.. విజ‌య‌సాయిరెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>