Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్‌కి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే చీఫ్ విజయ్ (TVK Chief Vijay) కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ‘ప్రియమైన విజయ్.. రాహుల్ గాంధీ సమక్షంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తమిళనాడు సీఎంగా పేదలకు సంక్షేమంతో పాటు అందరికి న్యాయం అందిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో మరింత ఉన్నత శిఖరాలకు చేర్చుతారని సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

అలాగే, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా టీవీకే చీఫ్ కు అభినందనలు తెలిపారు. అంకిత భావంతో, దూరదృష్టితో ప్రజలకు సేవ చేసేందుకు అవసరమైన శక్తి, విజ్ఞత, విజయం లభించాలని పొన్నం ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>