కరీంనగర్ కార్పొరేషన్ లో ఘనంగా దీపావళి వేడుకలు

కలం, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ (Karimnagar Municipal Corporation) కార్యాలయంలో శనివారం దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన లక్ష్మీపూజలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాసం గణేష్, చాడగొండ బుచ్చిరెడ్డి, అడిషనల్ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మోహియోద్దీన్, అయాజ్, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>