epaper
Sunday, March 1, 2026
epaper

అధికారులకు రేవంత్ వార్నింగ్.. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే అంతే!

కలం, వెబ్ డెస్క్: గ్రూప్ 1, గ్రూప్ 2 నూతన అధికారుల (Officers)  శిక్షణ ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  హాజరై మాట్లాడారు. ప్రజా పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నూతన అధికారులు సేవలు అందించబోతున్నారన్నారు. అధికారులు అయ్యాక బాధ్యత మరిచిపోయి మనిషిగా పతనం కావద్దని సూచించారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే బాధ్యత అధికారులదేనని సీఎం రేవంత్ అన్నారు. పేదవారికి సాయం చేసేముందు తల్లితండ్రులను గుర్తు పెట్టుకోవాలని సూచించారు. తల్లిదండ్రులను పట్టించుకోని వాళ్ల జీతంలో 10 నుంచి 15 శాతం కోత పెట్టేలా అసెంబ్లీలో చట్టం చేయబోతున్నామని సీఎం రేవంత్ అన్నారు.

తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని ఒప్పుకోరు అని రేవంత్ రెడ్డి అన్నారు. రాంజీ గోండు, కొమరం భీం రాజ్యాల కోసం పోరాటం చేయలేదని, అధిపత్యం చెలాయిస్తున్న వారిపైన తిరుగుబాటు చేశారని సీఎం గుర్తు చేశారు. కాకతీయ సామ్రాజ్యంపైన సమ్మక్క సారలమ్మ తిరుగుబాటు చేశారని, అందుకే వారు వనదేవతలుగా గౌర్వించబడుతున్నారని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం,స్వేచ్ఛ, సమాన అవకాశాల కోసం వారు అమరవీరులు అయ్యారని, నూతన అధికారులు వారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలన్నారు.

6 లక్షల మంది పోటీపడితే 582 మంది గ్రూప్ 1,775 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించారని, 15 ఏళ్ల పాటు గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం (Congress) గ్రూప్ 1 నిర్వహించి ఆకాంక్షలను నెరవేర్చిందని, టీజీపీఎస్‌సీని ప్రక్షాళన చేశామని, గ్రూప్ పరీక్షలపైన అవగాహన ఉన్న వాళ్ళని చైర్మన్ గా, సభ్యులుగా నియమించామన్నారు. ప్రశ్నా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్మేందుకు అవకాశం లేకుండా చేశామని, గ్రూప్ 1 నికి ఎంపికైన ఆనందం 24 గంటలు లేకుండా గిట్టని వాళ్ళు కోర్ట్ కు వెళ్లారని సీఎం రేవంత్ ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!