కలం, నల్లగొండ బ్యూరో : ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ముక్త్యాల బ్రాంచ్ కెనాల్(ఎంబీసీ) ఎత్తిపోతల స్కీమ్‌ను పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar)తెలిపారు. గురువారం ఆయన ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌ను సందర్శించి, పనులు పరిశీలించారు. ఈ స్కీమ్ పూర్తయితే ఈ ప్రాంత రైతాంగానికి, వ్యవసాయానికి పెద్ద గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని మంత్రి అన్నారు. ఇది పూర్తయితే మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల పరిధిలోని 53 వేల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని చెప్పారు.
ప్రాజెక్టు పూర్తి అయితే నేరుగా 19,295 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఒక్క మఠంపల్లి (Mattampally) మండల పరిధిలోనే 20,466 ఎకరాల ఆయకట్టుకు చెందిన 2,540 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 191 ఎకరాల భూసేకరణ నిర్వహించి, భూ యజమానులకు రూ.56 కోట్ల నష్టపరిహారం చెల్లించినట్లు ఆయన తెలిపారు. మేళ్లచెరువు మండలంలో 17,829 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు మంత్రి సూచించారు. నిరంతర నీటి సరఫరా కోసం ఇక్కడ 132/11 కే. వి సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన (Uttam Kumar)ప్రకటించారు.
Read Also : ఈ ఏడాది నుంచే వంద తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Instagram

