Mobile Popup Ad
Mobile Popup Ad

ఉగాదికి సీఎం రేవంత్ శుభవార్త.. ఈ నెల 22 నుంచి రైతుభరోసా

కలం, వెబ్ డెస్క్: ఈ నూతన సంవత్సరం రైతు నామ సంవత్సరం అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభివర్ణించారు. హైదరాబాద్‌ లోని రవీంద్రభారతిలో భాష, సంస్కృతి, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు (Sri Parabhava Nama Ugadi Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. ఉగాది ప్రధానంగా రైతుల పండుగ అని సీఎం అభివర్ణించారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని హామీ ఇచ్చారు.

రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో తమ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశామన్నారు. రైతులు ఆత్మగౌరవంతో బతకేందుకు ప్రభుత్వం కృషి చచేస్తోందన్నారు. రైతుభరోసా ద్వారా ఇప్పటికే రైతులకు రూ.18 వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. ఈనెల 22 నుంచి మళ్లీ రైతుభరోసా (Rythu Bharosa) కార్యక్రమం ప్రారంభమవుతుందని సీఎం శుభవార్త చెప్పారు. రైతుల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

హైదరాబాద్‌ లోని రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలు సీఎం ప్రారంభించారు. ఉగాది సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth) పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఉగాది వేడుకల్లో పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ వేంనరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. రవీంద్రభారతిలో డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ పంచాంగ శ్రవణం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు కవి సమ్మేళనం జరుగనుంది.

Read Also: కొత్త పార్టీపై హైకోర్టులో కవితకు భారీ ఊరట

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>