కలం, వెబ్ డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh)ను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు గురి చేయడం కలకలం రేపింది. ఈ మేరకు దుండగులు ఓ బెదిరింపు లేఖను పంపినట్లు రాజాసింగ్ వెల్లడించారు. శ్రీ రామనవమి (Ram Navami) రోజు నిర్వహించే శోభాయాత్రలో రాజాసింగ్‌ను చంపేస్తామని లేఖలో పేర్కొన్నారు. వాలంటీర్ల సమావేశంలో రాజాసింగ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. హత్య కోసం ముగ్గురు స్నైపర్లను నియమించినట్టు లేఖలో పేర్కొన్నారని చెప్పారు. శోభాయాత్ర సాగే మార్గంలో బాంబులు అమర్చుతామని బెదిరించినట్లు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సీరియస్‌గా తీసుకోరని, అందుకే ఫిర్యాదు చేయలేదని రాజా సింగ్ స్పష్టం చేశారు.
Read Also: రైతు ఉత్సవాల్లో పాల్గొనండి.. సీఎంకు భట్టి, తుమ్మల ఆహ్వానం
Follow Us On: Facebook

