కలం, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం హయాంలో హైదరాబాద్‌లో చెరువులు కబ్జాకు గురయ్యాయని.. అందుకే తాము అధికారంలోకి రాగానే కబ్జా కోరుల కోరలు పీకే కార్యక్రమం చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. అంబర్‌పేట్‌లో ఒకప్పుడు బతుకమ్మ కుంట ఉండేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి కేసీఆర్‌పై హెలికాప్టర్ ద్వారా పూలు చల్లి, కుంటను కబ్జా చేసుకున్నాడని ఆరోపించారు. బతుకమ్మ కుంట కేసీఆర్ తాతదా.. సుధాకర్ రెడ్డికి రాసివ్వడానికి.. అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఎకరం రూ.100 కోట్లకు అమ్మినట్లు చెప్పుకుంటున్నవారు, చిన్న వర్షానికే నగరం నీటమునుగుతుంటే ఏం చేశారని ప్రశ్నించారు.
వారిని బండకేసి కొడుతారు..
భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ (FCDA) ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని అమెరికా వెళ్లి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారని.. అలాంటివారికి భవిష్యత్ ఉండదన్నారు.
Read Also: దేశ ప్రజలే నాకు దేవుళ్లు: ప్రధాని మోదీ
Follow Us On: X(Twitter)

