కలం, వెబ్ డెస్క్: గోవా రాష్ట్రం డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. హైదరాబాద్‌కు సరఫరా అవుతున్న డ్రగ్స్ ఇక్కడి నుంచే వస్తున్నట్లు తమ పోలీసులు గుర్తించారని వివరించారు. ఇలాంటి చెడ్డ పేరు ఈ రాష్ట్రానికి అవసరమా.. అని ప్రశ్నించారు. గోవా రాజధాని పనాజీలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సభలో సీఎం రేవంత్ హాజరై మాట్లాడారు. గోవా యువత బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం గోవాలోని ప్రభుత్వ స్థలాలను అమ్మేస్తోందన్నారు.
కేంద్రంలో మూడోసారి మోదీ (Modi) అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని.. అదే జరిగితే దేశాన్ని దేవుడు కూడా కాపాడలేరని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. జ్ఞానేష్ కుమార్‌ను అడ్డు పెట్టుకుని దేశ ప్రజల ఓట్లు తొలగించాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రావణుడి లాంటి బీజేపీని ఓడించాలంటే.. రాముడి లాంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. యూపీ, ఢిల్లీలో కూడా వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు. 2027లో గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుందన్నారు. ఇక్కడి ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : ఢిల్లీ డీసీపీ చెప్పేవన్నీ అబద్ధాలే.. అభిజిత్ తీవ్ర ఆరోపణలు
Follow Us On: Youtube

