ఢిల్లీ డీసీపీ చెప్పేవన్నీ అబద్ధాలే.. అభిజిత్​ తీవ్ర ఆరోపణలు

క‌లం, వెబ్‌డెస్క్‌: కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కే (Abhijit Dipke) నాన‌మ్మ మృతి చెందిన నేప‌థ్యంలో ఢిల్లీ పోలీసులు (Delhi Police) ఆయ‌న‌కు అన్ని విధాలా స‌హాయం అదించారంటూ డీసీపీ నేహా యాద‌వ్ (DCP Neha Yadav) చేసిన వ్యాఖ్య‌ల‌పై అభిజిత్ ఘాటుగా స్పందించారు. పోలీసులు తన కజిన్‌తో మాట్లాడేందుకు, ఫోన్‌లో నంబర్ తీసుకునేందుకు కూడా అనుమతించలేదని ఆరోపించారు. తన లాయ‌ర్‌తో మాట్లాడేందుకు రిక్వెస్ట్‌ చేసినా తిరస్కరించారని ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టులో వెల్లడించారు. మ‌హారాష్ట్ర‌లో తన నానమ్మతో క‌లిసి ఉండే కజిన్‌తో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరినట్లు అభిజిత్ తెలిపారు. కనీసం రెండు నిమిషాల పాటు ఫోన్ ఇస్తే కజిన్ నంబర్ తీసుకుంటానని అడిగిన‌ట్లు చెప్పారు. పోలీసులు తనకు ఒక్క క్ష‌ణం కూడా ఫోన్ ఇవ్వలేదని ఆరోపించారు.

త‌ర్వాత ఉద‌యాన్నే తన తండ్రికి ఫోన్ చేసి, తాను చాలా రోజులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పాల‌ని పోలీసులు బెదిరించిన‌ట్లు అభిజిత్ (Abhijit Dipke) వెల్లడించారు. అప్పటికే తన నానమ్మను కోల్పోయిన బాధలో ఉన్న తండ్రిని అర్ధరాత్రి దాటిన తర్వాత ఫోన్ చేసి మరింత మానసిక వేదనకు గురిచేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తన కుటుంబాన్ని ఇంకా ఎంత బాధకు గురిచేస్తార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు పోలీసులు అన్ని విధాలా సహాయం అందించారని డీసీపీ నేహా యాదవ్ పేర్కొన్న నేపథ్యంలో అభిజిత్ దీప్కే చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పోలీసులు తనకు సహాయం చేశారన్న వాదనకు భిన్నంగా, కనీసం ఫోన్‌ వాడేందుకు, న్యాయవాదితో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆయన ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. డీసీపీ నేహా యాద‌వ్ మాత్రం అభిజిత్ నాన‌మ్మ చనిపోయిన నేప‌థ్యంలో విమాన టికెట్లు, ఫోన్ కాల్స్ లేదా ఇతర అవసరాలకు సహాయం కావాలా అని పోలీసులు అడిగిన‌ట్లు చెప్పారు. అలాగే తల్లిదండ్రులతో ఫోన్‌ మాట్లాడ‌తారా? అని కూడా పలుమార్లు అడిగినట్లు వివ‌రించారు. అయితే దీప్కే పోలీసుల సూచ‌న‌ల‌ను తిర‌స్క‌రించార‌ని వెల్ల‌డించారు.

Also Read : 2047 నాటికి భారత్ అభివృద్ధి: ప్రధాని మోదీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>