Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ ఆదాయ పెంపు.. సీఎం కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఆదాయ సమీకరణ (Revenue Collection)పై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా లక్ష్యాలు సాధించాలంటే ఆదాయ సమీకరణపై సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై అధికారులతో ఎంసీఆర్‌హెచ్ఆర్డీ (MCRHRD)లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ (HMDA), తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) రాష్ట్ర రెవెన్యూ పెంచడంపై దృష్టిసారించాలని సూచించారు. కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్ తో పాటు ఇతర శాఖలకు సంబంధించి లీకేజీలు లేకుండా జాగ్రత వహించాలన్నారు. ఆదాయ సమీకరణకు సంబంధించి చేజింగ్ సెల్ నేర్పాటు చేసుకుని నిరంతరం ఫాలో అప్ చేయాలని దిశానిర్దేశం చేశారు.

అనుకుంటున్న స్థాయిలో పనిచేయాలంటే శాఖలవారీగా డిపార్ట్‌మెంట్స్ సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని సీఎం సూచించారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించుకుని లబ్ధిదారుల జాబితాను డీబీటీ (DBT)కి అనుసంధానం చేసుకోవాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర పనులను పూర్తి చేసేందుకు అనుగుణంగా బడ్జెట్‌ను తయారు చేసుకోవాలన్నారు. ఊహాజనిత బడ్జెట్ కాకుండా, వాస్తవికత ఆధారంగానే బడ్జెట్‌ను రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు.

వివిధ శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం వీడాల్సిందేనని అధికారులకు సూచించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంతోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారులు రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>