నేడు మంత్రుల‌తో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్‌

క‌లం, వెబ్ డెస్క్‌: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు ఉదయం 11 గంటలకు మంత్రుల‌తో జూమ్ మీటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. సీఎం అమెరికా ప‌ర్య‌ట‌న ముగించుకొని నేడు తెల్ల‌వారుజామున హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసానికి చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నేపథ్యంలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై చ‌ర్చించేందుకు జూమ్ మీటింగ్ (Zoom Meeting) ఏర్పాటు చేశారు. అభ్య‌ర్థుల‌కు ఇవ్వాల్సిన బీఫామ్‌లు, ఎన్నిక‌ల ప్ర‌చారం, తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై సీఎం చ‌ర్చించ‌నున్నారు.

టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఈ జూమ్ మీటింగ్‌లో పాల్గొన‌నున్నారు. మ‌రోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మున్సిపల్ ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొన‌నున్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో 90 శాతం స్థానాల్లో గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) అమెరికాలో ఉన్న‌ప్పుడు సైతం పార్టీ ముఖ్య నేత‌ల‌తో జూమ్ మీటింగ్ నిర్వ‌హించి దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఒక్క‌రూ స‌మ‌న్వ‌యంతో ముందుకెళ్లి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.

 Read Also: గెలిచే అభ్యర్థులకే బీ-ఫామ్స్ : సీఎం రేవంత్​ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>