Mobile Popup Ad
Mobile Popup Ad

మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు సీఎం ధామి అభినందనలు

కలం, కరీంనగర్ బ్యూరో : ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్ (Rishikesh) నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 117వ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం ధామి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్‌ను (Kolagani Srinivas) అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కరీంనగర్‌లో బీజేపీ ఘన విజయం సాధించడంతో పాటు, అత్యంత పిన్న వయసులో మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ఎంపిక కావడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

మేయర్ కొలగాని శ్రీనివాస్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి కృతజ్ఞతలు తెలియజేసి, ఘనంగా సన్మానించారు. అలాగే సమావేశానికి హాజరైన ఉత్తరాఖండ్ మంత్రులు సుబోధ్ ఉన్నియాల్, ప్రేమ్ చంద్ర అగర్వాల్, మదన్ కౌశిక్, హరిద్వార్ లోక్‌సభ సభ్యుడు త్రివేంద్ర సింగ్ రావత్, రాజ్యసభ సభ్యుడు మహేంద్ర భట్, ఋషికేశ్ ఎమ్మెల్యే ప్రేమ్ చంద్ర అగర్వాల్ తదితరులను మేయర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశాలు నగర పాలన, అభివృద్ధి అంశాలపై దేశవ్యాప్తంగా మేయర్ల మధ్య చర్చలకు వేదికగా నిలిచాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>