కలం, కరీంనగర్ బ్యూరో : క్రీడా రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, క్రీడాకారులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాణించాలని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం అన్నారు. చీఫ్ మినిస్టర్ కప్- 2025 (CM CUP- 2025) టార్చ్ ర్యాలీ కరీంనగర్ (Karimnagar) లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టేడియం నుండి ప్రారంభమై తెలంగాణ చౌక్ వరకు సాగింది. ర్యాలీని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ప్రారంభించారు. తెలంగాణ చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.
అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ర్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. గతంలో క్రీడాకారులకు రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు ఉండేవి కావని అన్నారు. ఈ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కృషి చేస్తుందని, క్రీడాకారులకు అవకాశాలు, ప్రోత్సాహకాలు కల్పిస్తుందని తెలిపారు. ఫుట్ బాల్ దిగ్గజం మెస్సి (Messi) తో ఫుట్ బాల్ ఆడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విద్యార్థుల్లో, క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారని ఆయన తెలిపారు. రాష్ట్రం నుండి అనేక మంది క్రీడాకారులు ఒలంపిక్స్ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని క్రీడల్లో రాణించాలని సూచించారు.
Read Also: కొండగట్టు బాధితులకు సర్కార్ చేయూత..
Follow Us On: Instagram


