Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు తునిలో సీఎం చంద్రబాబు పర్యటన

కలం, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు (CM Chandrababu) సోమవారం కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, క్యాడర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరనున్న సీఎం చంద్రబాబు.. ఉదయం 10:50 గంటలకు చామవరం చేరుకుని ‘ప్రజా వేదిక’లో పాల్గొంటారు. కాగా, ప్రతి నెలా ఏదో ఒక గ్రామంలో పెన్షన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు స్వయంగా హాజరవుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే చామవరం గ్రామంలో మధ్యాహ్నం 02:10 గంటలకు సీఎం చంద్రబాబు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 2:40 గంటలకు తుని టీడీపీ శ్రేణులతో సమావేశమై సాయంత్రం 5:15 గంటలకు అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు. తునిలో సీఎం చంద్రబాబు పర్యటనతో అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. అధినేత రాకతో తుని టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>