కలం, సినిమా : బెజవాడ గడ్డపై మెగా సందడి మొదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘పెద్ది’(Peddi) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హాజరుకానుండటంతో మెగా అభిమానులలో మరింత ఉత్సాహం పెరిగింది. పవన్ రాకతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ ఏర్పడనుంది.
అభిమానులు భారీ సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాబాయ్–అబ్బాయ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. దీంతో ఈ ఈవెంట్‌పై సినీ వర్గాలలో, అభిమానులలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ వేడుకలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా పాల్గొననుంది. పవన్ కల్యాణ్ రాక నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

