నేతన్నలకు గుడ్ న్యూస్.. నేడు అకౌంట్లోకి డబ్బులు

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని బాపట్ల జిల్లా చీరాలలో శుక్రవారం సీఎం చంద్రబాబు (CM Chandrababu) పర్యటించనున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ‘నేతన్న సేవలో’ (Nethanna Sevalo) పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగే కార్యక్రమంలో సీఎం నిధులను విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద అర్హులైన చేనేత కుటుంబాలకు రూ.25 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు సుమారు రూ.179 కోట్ల నిధులను కూటమి ప్రభుత్వం ప్రభుత్వం రిలీజ్ చేయనుంది.

సీఎం షెడ్యూల్ ఇలా..

సీఎం చంద్రబాబు చీరాల పర్యటనా షెడ్యూల్ ను సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30కు ఉండవల్లిలోని ఇంటి నుంచి బయలుదేరుతారు. 10.50కి చీరాల కొత్తపేటలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ సీఎంకు నాయకులు, అధికారులు స్వాగతం చెబుతారు. 11.05కు ప్రజావేదిక వద్దకు చేరుకుని 12.35 వరకు అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం1.20 గంటలకు జాండ్రపేటకు చేరుకొని మగ్గాలను పరిశీలించి లబ్దిదారులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 2.15కు అక్కడి నుంచి బయలుదేరి పార్టీ ఆఫీస్ సమీపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4.25 గంటలకు చీరాల కొత్తపేట నుంచి బయలుదేరి 4.45కు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

అన్ని ఏర్పాట్లు సిద్ధం..

సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికతో పాటు హెలిప్యాడ్, నాయకులతో సమావేశానికి మరో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. కొత్తపేట బైపాస్ వద్దనున్న పార్టీ కార్యాలయం పక్కనే సభావేదిక సిద్ధం చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే వారితోపాటు అధికారుల వాహనాలు పార్కింగ్కు స్థలం సిద్ధం చేశారు. భోజనాల ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>