కలం, వెబ్‌డెస్క్: పల్నాడు (Palnadu) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రెంటచింతలలో ఓ వైసీపీ నేత (YSRCP Leader)ను దారుణంగా హత్య చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. నేడు ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడిని రెంటచింతలకు చెందిన నవులూరి చెన్నారెడ్డిగా గుర్తించారు.
రెంటచింత నుంచి రెంటాల వెళ్లే దారిలో పులోళ్ల బావి సమీపంలో ఈ హత్య జరిగింది. దుండగులు అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపేశారు. ఈ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

