కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా నిర్మల్ (Nirmal), ముధోల్ (Mudhole) నియోజకవర్గాల పరిధిలోని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు నిర్మల్, బైంసా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel) మంగళవారం ప్రకటించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్ఠం చేయడం, కార్యకర్తలను సమన్వయం చేయడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.
నిర్మల్ నియోజకవర్గంలో నిర్మల్ రూరల్ పొలాస మల్లేష్, సోన్ షేక్ మొహినుద్దీన్, సారంగాపూర్ మాధవరావు, దిలావర్‌పూర్ దేవేందర్ రెడ్డి, మామడ రాథోడ్ సంతోష్, లక్ష్మణచందా నరేష్ రెడ్డి, నర్సాపూర్ (జి) మోతీలాల్ పటేల్, నిర్మల్ టౌన్ హరీష్, ముధోల్ నియోజకవర్గంలో బైంసా రూరల్ గజానన్ షిండే, కుంటాల ఆనంద్‌రావు పటేల్, కుబీర్ మహిపాల్ రెడ్డి, తానూరు పుండలిక్ రెడ్డి, లోకేశ్వరం ముత్తగౌడ్, బాసర లక్ష్మణ్‌రావు, బైంసా టౌన్ అరవింద్‌ను అధ్యక్షులుగా నియమించారు. నూతనంగా నియమితులైన అధ్యక్షులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

