కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో షాబాద్ ఘటనలో పోక్సో నిందితుడు బెయిల్‌పై విడుదలైనట్లుగానే ఇంకో జిల్లాలో ఓ పోక్సో నిందితుడు రిలీజ్ అయ్యాడు. పోక్సో నిందితుల్ని బెయిల్‌పై విడుదల చేయడంపై రాష్ట్రంలో విమర్శలు వెల్లువెత్తిన తరుణంలోనే రెండో ఘటనలో మరో నిందితుడు బయటకొచ్చాడు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ చేసిన ఆరు హత్యలను మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. తాజా ఘటనలో యాదాద్రి పోక్సో కేసు (Yadadri POCSO Case)లో అరెస్ట్ అయిన వ్యక్తి బెయిల్ పై విడుదలై బాధిత బాలికను కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అడ్డగూడూరుకు చెందిన చైతన్య అదే గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంట్లో చొరబడి ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చైతన్యపై పోక్సో కేసు (Yadadri POCSO Case) నమోదు చేశారు. కానీ, నిందితుడిని రిమాండ్‌కు తరలించకుండా పోలీసులు బెయిల్‌పై విడుదల చేశారు. దీంతో చైతన్య విడుదలైన వెంటనే బాధిత బాలికను కిడ్నాప్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. చైతన్య కోసం కూడా వెతుకుతున్నారు. వీరిద్దరూ ఎక్కడికి వెళ్లారు? అసలు ఆ బాలికను చైతన్యే తీసుకెళ్లాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల షాబాద్ ఘటన గురించి తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు ఏం జరుగుతుందోనని ఆందోళనలో ఉన్నారు.
Read Also: ఆ సంస్థతో మాకు సంబంధం లేదు.. ఎన్టీఆర్ ఆఫీస్ కీలక ప్రకటన
Follow Us On: Instagram

