Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యుత్, వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

కలం, వెబ్ డెస్క్: ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి విద్యుత్ నెట్ వర్క్‌ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పీఎం సూర్యఘర్ అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు విద్యుత్ శాఖపై సీఎం సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ను 18 గిగావాట్లను ప్రధాన గ్రిడ్‌కు కనెక్ట్ చేసేలా సుమారు రూ.22 వేలకోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ భవనాలపై సోలార్ ఏర్పాటు పనులు త్వరితగతిన చేపట్టాలని సూచించారు.

ఈ మీటింగ్‌లో గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంశం సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే ఆరు నెలల ప్రణాళిక, పీఎం సూర్య ఘర్, పీఎం కుసుమ్, పీఎంఈ-డ్రైవ్ పథకాల పురోగతి, ఏపీఐఈసీ పాలసీ కింద ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, నెడ్‌క్యాప్ బలోపేతం, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, విద్యుత్, ట్రాన్స్ కో, జెన్కో, డిస్కంలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అటు క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా ప్రాథమిక రంగంలోని 6 మిషన్లపై సమీక్షలో చర్చించారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వా కల్చర్‌, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, తదితర రంగాలపై తీసుకోవాల్సిన నిర్ణయాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఆయా శాఖల ఉన్నతాధికారులు, సంబంధిత పలు కార్పొరేషన్ ల చైర్మన్ లు సమీక్షలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>