పోలవరం పూర్తి చేసి కృష్ణానదికి అనుసంధానిస్తాం: సీఎం చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టును (Polavaram Project) 2027లో గోదావరి పుష్కరాల్లోపు పోలవరం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలలో శుక్రవారం నిర్వహించిన ‘‘పేదల సేవలో’’, ‘‘మేడే’’ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలకు పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం అక్కడ నిర్వహించిన సభలో పాల్గొని ప్రసంగించారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మళ్లీ రూ.1000 కోట్లతో పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పూర్తి చేసి కృష్ణానదికి అనుసంధానిస్తామని సభావేదికగా స్పష్టం చేశారు. కృష్ణా పుష్కరాల నాటికి కృష్ణా జిల్లాకు నీటి ఎద్దడి లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ నాటికి బందర్‌పోర్టు నిర్మాణం సైతం పూర్తి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్-మచిలీపట్నం హైవే ఎక్స్‌ప్రెస్‌ రోడ్డుగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. వైజాగ్ లో గూగుల్‌ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోందని సీఎం (CM Chandrababu) వివరించారు.

 Read Also: ఇండియా లో పెరుగుతున్న డింక్​ కల్చర్..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>