కలం, వెబ్ డెస్క్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఘన నివాళులర్పించారు. టంగుటూరి ప్రకాశం పంతులు.. తెలుగువారి ధైర్యసాహసాలకు, ఆత్మగౌరవానికి ప్రతీక అని కొనియాడారు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్ధతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయుడని పేర్కొన్నారు. ఆ మహోన్నత నాయకుడి సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందామని ఆకాంక్షించారు. టంగుటూరిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
అటు టంగుటూరి ప్రకాశం పంతులు (Tanguturi Prakasam Pantulu) వర్ధంతి సందర్భంగా మంత్రి లోకేశ్ ఘన నివాళులు అర్పించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు అని కొనియాడారు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు అని పేర్కొన్నారు. ధైర్య సాహసాలు, ప్రజాసేవ, దేశభక్తికి ఆయన ప్రతీకగా నిలిచారని తెలిపారు. భారత స్వాతంత్య్ర పోరాటం నుంచి రాష్ట్ర నిర్మాణం వరకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయ సాధనకు అందరూ పునరంకితం కావాలని ఆకాంక్షించారు.

