చివరి నిమిషంలో ట్విస్ట్.. భారత ఫ్లాగ్ బేరర్‌గా పవన్ సెహ్రావత్!

కలం, వెబ్ డెస్క్: ఆసియా క్రీడల (Asian Games) ప్రారంభోత్సవానికి ముందు భారత ఫ్లాగ్ బేరర్ విషయంలో అనూహ్య మార్పు జరిగింది. తొలుత తజిందర్‌పాల్ సింగ్ తూర్‌ (Tajinderpal Singh Toor) ను ఫ్లాగ్ బేరర్‌గా ఎంపిక చేశారు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఆయన ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయారు. దీంతో కబడ్డీ స్టార్ పవన్ సెహ్రావత్‌ (Pawan Sehrawat) కు చివరి నిమిషంలో అవకాశం దక్కింది. ఆయన షూటింగ్ స్టార్ మను భాకర్‌తో కలిసి భారత జెండాను మోయనున్నారు. ఈ విషయం తెలియగానే పవన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

తనకు ఫ్లాగ్ బేరర్‌గా అవకాశం దక్కిందని తెలుసుకున్న తర్వాత రాత్రంతా నిద్రపోలేదని చెప్పారు. అయినా ఉదయం జిమ్‌కు వెళ్లి సాధన చేశారు. దేశ జెండాను చేతిలో పట్టుకుని నడవడం తనకు ఎంతో గర్వకారణమని పవన్ తెలిపారు. ఈ విషయాన్ని పవన్ వెంటనే అందరికీ చెప్పలేదు. రాత్రి తన అన్న అంకుర్‌కు మాత్రమే సమాచారం ఇచ్చారు. ఉదయం మాత్రం ఫ్లాగ్ బేరర్‌గా ఎంపికైన విషయాన్ని అందరికీ తెలిపారు. మను భాకర్‌తో కలిసి జెండా మోయడం కూడా పవన్‌కు ప్రత్యేకంగా అనిపించింది.

గతంలోనే ఆమెను కలిశానని చెప్పారు. మను ఎంతో ప్రోత్సహించే అథ్లెట్ అని పవన్ పేర్కొన్నారు. ఆమెతో కలిసి భారత జెండాను మోయడం గర్వంగా ఉందని తెలిపారు. 2022 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత కబడ్డీ జట్టులో పవన్ భాగంగా ఉన్నారు. ఇప్పుడు అదే ఆసియా క్రీడల ప్రారంభోత్సవంలో దేశానికి ఫ్లాగ్ బేరర్‌గా నిలిచే గౌరవం ఆయనకు దక్కింది. మరోవైపు మను భాకర్‌తో కలిసి భారత బృందానికి ఆయన నాయకత్వ ప్రతీకగా నిలవనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>