కలం, నిర్మల్: స్వచ్ఛత హి సేవా (Swachhata Hi Seva 2026) ప్రచారంలో భాగంగా నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీబీజీ రామ్ జీ, సెర్ప్ సిబ్బందికి స్వచ్ఛత, పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ.. చెత్తను వివిధ పద్ధతుల్లో వేరు చేయడం, వ్యర్థాలను తగ్గించడం, పునర్వినియోగం, పునరుత్పత్తి విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే విధానాలు, పరిశుభ్రత, పారిశుధ్యం, చెత్త నిర్వహణ పద్ధతులపై సిబ్బందికి వివరించారు. అనంతరం అధికారులు, సిబ్బంది స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

