పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వండి.. మంత్రి పొంగులేటికి సిపిఐ వినతి

కలం, హనుమకొండ : నిరుపేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి శనివారం హైదరాబాద్ లోని తన నివాసంలో సిపిఐ (CPI) నేతలు వినతి పత్రం అందజేశారు. హనుమకొండ నగరంలోని సర్వే నంబర్ 964, 966, దీన్ దయాల్ నగర్, బంధం చెరువు, కోట చెరువు, ఇందిరమ్మ కాలనీల్లో అనేక సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారికి పట్టాలివ్వాలని వారు కోరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ,ఇల్లు లేని నిరుపేదలకు పట్టాలు ఇచ్చి పక్క గృహాలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సిపిఐ నాయకులు చాడ వెంకటరెడ్డి, కిషోర్, అలకుంట్ల మల్లన్న, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, జోగుదుర్గ, కనకం కావ్య తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>