కలం, వెబ్ డెస్క్: ప్రజా తీర్పుపై అలిగి అసెంబ్లీకి రావడం లేదని సీఎం చంద్రబాబు (CM Chandrababu) జగన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వైసీపీ గ్రాఫ్ మరింత పడిపోయి.. కూటమి ప్రభుత్వం గ్రాఫ్ పెరిగిందని సర్వేల్లో తేలిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేసుకుంటూ వెళ్లిపోయారని ఆరోపించారు. ప్రస్తుతం పరిస్థితులను చక్కదిద్దుతున్నామని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని వివరించారు. అందుకు మరికొంత సమయం పడుతుందన్నారు.
సీఎం అంటే కామన్ మ్యాన్‌లా ఉండాలనేదే తన ఆలోచన అని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. బటన్లు నొక్కి వదిలేయడం కాకుండా.. నిరంతరం పేదల సేవల పాల్గొనమే తనకు ముఖ్యమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భూ సమస్యలను వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే తాను, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ కలిసినట్లు వివరించారు. ప్రజలకు సేవకులం తప్ప పెత్తందారులం కాబోమని తేల్చి చెప్పారు.
స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర లక్ష్యం..
రాష్ట్రంలో ప్రతి మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలను రూపొందించామని సీఎం చంద్రబాబు అన్నారు. మన ఇల్లు బాగుంటే సరిపోదని.. పరిసరాలు, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా తీసుకుని.. తనతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా సేవలో నిమగ్నమవుతున్నట్లు వివరించారు. ప్రజలే తమకు ప్రతిపక్షమని.. వేరే ప్రతిపక్షం లేదని వైసీపీని ఉద్దేశించి అన్నారు. ప్రజల ఉత్సాహమే తనకు మనోబలమని.. ప్రతి రోజు చురుగ్గా పనిచేయగలుగుతున్నట్లు వివరించారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్‌గా ఉండాలనేదే తన లక్ష్యమన్నారు. నాలుగోసారి తాను ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నానని.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో అత్యధిక సంవత్సరాలు అధికారంలో ఉన్నది తానే అన్నారు.
Also Read : లా గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్: హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టులు
Follow Us On: Youtube

