Mobile Popup Ad
Mobile Popup Ad

స్వచ్ఛమైన పాఠశాలలే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది: శ్రీనివాస్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) పిలుపుమేరకు కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) ఆధ్వర్యంలో “మన బడి – మన బాధ్యత, స్వచ్ఛ పాఠశాల” కార్యక్రమాన్ని (Clean School Drive) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం 2వ డివిజన్ తీగలగుట్టపల్లి ప్రభుత్వ పాఠశాలలో విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశుభ్రం చేశారు. తరగతి గదులను నీటితో కడిగి శుభ్రపరిచారు. విద్యార్థులు ఉపయోగించే బెంచీలు, కిటికీలు, తలుపులు, ప్రాంగణంలోని మొక్కల పరిసరాలను సైతం శుభ్రపరిచారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ “మన బడి – మన బాధ్యత” అనే భావనతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నాయకులు కోరారు.

పాఠశాల పరిశుభ్రతతో పాటు విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమం (Clean School Drive) ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు సమాజానికి ఆస్తులని, వాటి సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. విద్యార్థులు పరిశుభ్రమైన వాతావరణంలో చదువుకుంటే వారి ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆలోచనలకు అనుగుణంగా పాఠశాలల అభివృద్ధి, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువత, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని పాఠశాల పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

Read Also: మీనాక్షి కోసం త్యాగం చేసే ఆ ‘ఒక్కరు’ ఎవరు?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>