అమరావతి అంటేనే అవినీతి : అంబటి సంచలన ఆరోపణలు!

కలం, వెబ్ డెస్క్​: గత ఏడేళ్ల కాలంలో రాజధాని అమరావతికి (Amaravati) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, అమరావతి అభివృద్ధికంటే మార్కెటింగ్ ప్రచారమే ఎక్కువగా సాగుతోందని విమర్శించారు.

రోడ్ల నిర్మాణాల పేరిట కోట్ల ప్రజాధనం దుర్వినియోగం

అమరావతి పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అడ్డగోలుగా ఖర్చు చూపిస్తూ దోచుకుంటున్నారని అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. సాధారణంగా రూ.100 కోట్లతో పూర్తి చేయాల్సిన రోడ్డు నిర్మాణ అంచనాలను ఏకంగా రూ.365 కోట్లకు పెంచారని ఆయన పేర్కొన్నారు. కేవలం 21.77 కిలోమీటర్ల రోడ్డు కోసం రూ.1,519 కోట్లు ఖర్చు చేయడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదన్నారు. ఒక కిలోమీటర్ రోడ్డుకు రూ.180 కోట్లు, చదరపు మీటర్ రోడ్డుకు రూ.10 లక్షల చొప్పున లెక్క చూపిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

పెంచిన అంచనాల వెనుక అసలు కథ

అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం ఏడు భవనాలు మాత్రమే పూర్తయ్యాయని, కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ఇప్పటికీ పూర్తి కాలేదని మాజీ మంత్రి తెలిపారు. తాత్కాలికంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జి కోసం రూ.80 కోట్లు ఖర్చు చేయడంలోని అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. చదరపు అడుగుకు రూ.20 వేల నుంచి రూ.22 వేల చొప్పున అద్దాల మేడల పేరిట వేల కోట్లు పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. అప్పులు తెచ్చిన డబ్బుల్లోంచి కూడా తండ్రీకొడుకులు భారీగా కమీషన్లు దండుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

Also Read : ర్యాంప్ వాక్ అదరగొట్టిన మాజీ నక్సల్స్.. నెటిజన్లు ఫిదా!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>