మోమోల కోసం రూ.85లక్షల బంగారం ఇచ్చేసిన బాలుడు

కలం, డెస్క్ : ఉత్తరప్రదేశ్ లో (Uttar Pradesh) విచిత్రమైన ఘటన జరిగింది. కేవలం మోమోల కోసం రూ.85 లక్షల విలువైన బంగారాన్ని ఇచ్చేశాడు ఓ బాలుడు. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar Pradesh) దేవరియా జిల్లాలో నివాసం ఉంటున్న ఓ ఫ్యామిలీలో రీసెంట్ గా రూ.85 లక్షల విలువైన బంగారం మాయమైంది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తులో షాకింగ్ విషయం బయటపడింది. ఫ్యామిలీలో ఏడో తరగతి చదువుతున్న బాలుడు ఉన్నాడు. అతనికి మోమోలు అంటే చాలా ఇష్టం.

మోమోలు తరచూ తినేందుకు ఇంట్లో వారు ఒప్పుకోవట్లేదు.. అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వట్లేదు. దీంతో ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను మోమోలు అమ్మే వ్యక్తులకు ఇచ్చేశాడు బాలుడు. ఆ బంగారానికి బదులుగా కొన్నేళ్ల దాకా ఉచితంగా మోమోలు ఇస్తామని దుకాణాదారులు బాలుడికి హామీ ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. బంగారాన్ని ఎంత మందికి ఇచ్చారు, ఎక్కడకు తరలించారు అనే విషయాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>