కలం, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ పేరిట అబ్బాయిలు కూడా చెవులు కుట్టించుకున్నారు (Ear Piercing). కానీ అబ్బాయిలు చెవులు కుట్టించుకోవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి భారతీయ సంప్రదాయంలో చెవులు కుట్టించుకోవడం కేవలం అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా ఒక ముఖ్యమైన సంస్కారంగా పరిగణించబడిందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో అబ్బాయిలు చెవులు కుట్టించుకోవడాన్ని (Ear Piercing) కేవలం ఒక ఆధునిక ఫ్యాషన్‌గా చూస్తున్నప్పటికీ, మన సంప్రదాయంలో దీని వెనుక ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక, చారిత్రక, శాస్త్రీయ నేపథ్యం దాగి ఉందట. హిందూ ధర్మంలో దీనిని “కర్ణవేధ సంస్కారం” అని పిలుస్తారని తెలిపారు పండితులు. ఇది ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారమట. చాలా కుటుంబాల్లో చిన్న వయసులోనే అబ్బాయిలకు చెవులు కుట్టిస్తారు. కొంతమంది ఉపనయన కార్యక్రమం సమయంలో కూడా చెవులు కుట్టించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాషన్ కారణంగా కూడా చాలామంది యువకులు చెవులు కుట్టించుకుంటున్నారు.
ఆధ్యాత్మికంగా చూస్తే చెవులు కుట్టించుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెవులు కుట్టించడం వల్ల రాహు, కేతు గ్రహాలకు సంబంధించిన ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని కొందరు పండితులు చెబుతారు. అలాగే మనసు స్థిరంగా ఉండడం, ఏకాగ్రత పెరగడం, ఆలోచనా శక్తి మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని విశ్వసిస్తారు. అందుకే పూర్వకాలంలో విద్యాభ్యాసం ప్రారంభించే ముందు కూడా కొందరు పిల్లలకు చెవులు కుట్టించేవారు.
Read Also: కూలర్ వల్ల మీ గది జిగటగా మారుతోందా? ఈ చిన్న చిట్కాతో చెక్ పెట్టండి
Read Also: డిజిటల్ విప్లవం

