కలం, వెబ్ డెస్క్ : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం లోగా రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అల్టిమేటం జారీ చేసింది. రేపటి లోగా జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయకపోతే, అక్టోబర్ 2న ముంబై నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) స్పష్టం చేశారు. గాంధీ జయంతి రోజున ముంబైలో నిరసనలు ప్రారంభించి.. తదనంతరం దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామని సీజేపీ ప్రతినిధులు వెల్లడించారు.
అంతకుముందు గురువారం సీజేపీ (CJP) చీఫ్ అభిజిత్ దీప్పే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఈసీ 48 గంటల్లోగా రాజీనామా చేయాలని అల్టిమేటం జారీ చేశారు. రాజీనామా చేయకపోతే జంతర్ మంతర్ 2.0 చేపడతామని దీప్కే హెచ్చరికలు జారీ చేశారు. జ్ఞానేష్ కుమార్ దేశద్రోహి అని భారత ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు అని ఆయన అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియను సీఈసీ తారుమారు చేశారని.. ఎవరు ఓటు వేయాలో కూడా ఆయనే నిర్ణయిస్తున్నారని ధ్వజమెత్తారు.

