ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

కలం, నిర్మల్: ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ (ASHA Workers) యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం సేవలందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ, ఇంద్రమాల, సహాయ కార్యదర్శులు రామలక్ష్మి, అనసూర్య, సరిత, సుగుణ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>