epaper
Wednesday, February 18, 2026
epaper

చౌటుప్ప‌ల్‌లో కాంగ్రెస్ కౌన్సిల‌ర్‌ పరుగో పరుగు

క‌లం, వెబ్ డెస్క్‌: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్ల ఎన్నికలతో హడావుడి నెలకొంది. ఆయా పార్టీ నేత‌ల మ‌ధ్య పలు చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇక చౌటుప్ప‌ల్ (Choutuppal) మున్సిపాలిటీలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. చైర్మ‌న్‌గా త‌న పేరు ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిల‌ర్ వాణి అలిగి ప‌రుగెత్తుకుంటూ మున్సిపల్ హాల్ నుంచి వెళ్లిపోయారు. ఆమె వెనుకే ప‌లువురు కాంగ్రెస్ (Congress) పార్టీ నాయ‌కులు వెళ్లారు. రోడ్డుపై వీళ్లు ప‌రుగెత్తుకుంటూ వెళ్లిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌రోవైపు వాణి అత్త త‌న చైర్మ‌న్ ప‌ద‌వికి త‌న కోడలి పేరు ప్ర‌తిపాదించ‌క‌పోవ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆందోళ‌న‌కు దిగారు.చైర్మ‌న్‌గా వాణి పేరు ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో ఆమె అనుచ‌రులు ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. న‌మ్మించి మోస‌గించార‌ని, వేరే వారికి చైర్మ‌న్ ప‌ద‌వి ఎలా ఇస్తార‌ని విమ‌ర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>