కలం, వరంగల్ బ్యూరో: భూపాలపల్లి (Bhupalpally) మున్సిపాలిటీ చైర్మన్‌గా బుర్ర కొమురయ్య గౌడ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వేకరించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా కొమురయ్య 2 వార్డు నుంచి గెలుపొందారు. నూతన చైర్మన్ (Chairman)గా ఎన్నికైన ఆయనకు పలువురు నాయకులు, అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొమురయ్య గౌడ్ మాట్లాడుతూ.. భూపాలపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, డెవలప్‌మెంట్ కోసం ఇతర పార్టీలతో సమన్వయం చేసుకుంటానన్నారు.


