Mobile Popup Ad
Mobile Popup Ad

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు దుర్మరణం

కలం, వెబ్‌ డెస్క్ : చిత్తూరు (Chittoor) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పి.కొత్తకోట రైల్వే బ్రిడ్జి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరు మహిళలు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన మిగిలిన ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసిన అధికారులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>