కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), స్టార్ డైరెక్టర్ బాబీ (Bobby)కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన “వాల్తేరు వీరయ్య” ఘన విజయం సాధించింది. వరుస ఫ్లాప్స్‌తో ఉన్న చిరంజీవికి సాలిడ్ హిట్ అందించింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం KVN ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. ఈ సినిమాను మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సెకండ్ హాఫ్‌లో వచ్చే భారీ యాక్షన్ సీక్వెస్ సినిమాకు హైలెట్‌గా నిలువనుంది. యాక్షన్‌తో పాటు హత్తుకునే ఎమోషనల్ డ్రామా కూడా ఉండనున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రానున్నాయి.

