కలం, వెబ్ డెస్క్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో(T20 World Cup 2026) భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలకమైన మొదటి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప్రోటీస్ జట్టు కివీస్ బౌలర్ల ధాటికి 10.2 ఓవర్లలో 77 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
న్యూజిలాండ్ బౌలర్ కోల్ మెకోంచీ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే డబుల్ అటాక్ చేసి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బ తీశాడు. క్వింటన్ డి కాక్ 8 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 10 పరుగులు చేసి ఫెర్గూసన్ చేతికి చిక్కి అవుట్ అయ్యాడు. ర్యాన్ రికెల్టన్ ఎదుర్కొన్న మొదటి బంతికే ఫిన్ అలెన్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేసినా .. 21 బంతుల్లో 18 పరుగులు (1 ఫోర్, 1 సిక్స్) చేసి రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
అనంతరం ధాటిగా ఆడుతున్న డెవాల్డ్ బ్రెవిస్(34; 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను జేమ్స్ నీషమ్ పెవిలియన్‌కు చేర్చగా, మరో డేంజరస్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్(6)ను ఔట్ చేసి రచిన్ రవీంద్ర తన ఖాతాలో రెండ్ వికెట్ చేర్చుకున్నాడు. మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ దక్షిణాఫ్రికా పరుగుల వేగాన్ని అడ్డుకున్నారు. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 84/5 పరుగులతో ఆడుతోంది. క్రీజులో ట్రిస్టన్ స్ట్రబ్స్(4), మార్కో యాన్సన్(3) ఉన్నారు. దక్షిణాఫ్రికా(T20 World Cup 2026) గౌరవప్రదమైన స్కోరు సాధించాలంటే వీళ్లతోపాటు మిగిలిన బ్యాటర్లూ బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంది.

