Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్డీయే ప్రభుత్వం ఉన్నంత కాలం ఏపీకి పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

కలం, డెస్క్ : రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నంత కాలం ఏపీకి పెట్టుబడులు వస్తూనే ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu). పెట్టుబడులపై వైసీపీ చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమే అని కొట్టిపారేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో పెట్టుబడిదారులు పారిపోయేలా చేశారని.. కానీ కూటమి హయాంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ పద్ధతిలో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

‘మేం చాలా కష్టపడి ఏపీ బ్రాండ్ ను నిలబెడుతున్నాం. పీపీపీ అంటే ప్రైవీటీకరణ కాదు. ఈ విధానంలో మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. ఏప్రిల్ 30 నాటికి 90 శాతం డేటా సెంటర్ కంప్లీట్ అవుతుంది. త్వరలోనే ఏపీలో భారీ కంపెనీలు ప్రారంభం కాబోతున్నాయి. రెవెన్యూ కూడా పెరుగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో ఎవరినీ లెక్కచేయబోం. కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి సహకరిస్తుంది. అందుకే మేం దూకుడుగా ముందుకు వెళ్తున్నాం’ అంటూ సీఎం చంద్రబాబు (Chandrababu) చెప్పారు.

Read Also: జగన్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు : మంత్రి అచ్చెన్నాయుడు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>