Mobile Popup Ad
Mobile Popup Ad

చినబొయినపల్లిలో విద్యా విప్లవం.. ప్రభుత్వ పాఠశాలలో 103 అడ్మిషన్లు

కలం, వరంగల్ బ్యూరో : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబొయినపల్లి (Chinnaboinapally)  గ్రామం ప్రభుత్వ విద్య బలోపేతానికి ఆదర్శంగా నిలిచింది. గ్రామంలోని పిల్లలందరినీ స్థానిక యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రైవేట్ పాఠశాలల వాహనాలను గ్రామంలోకి అనుమతించకూడదని నిర్ణయించడంతో పాటు, గ్రామసభ తీర్మానాన్ని ఉల్లంఘించి పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో చిన్నబొయినపల్లి గ్రామస్థులు ‘మహా అడ్మిషన్ల జాతర’ నిర్వహించి ప్రభుత్వ విద్యపై తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. “సామాజిక సమానత్వం విద్య ద్వారానే సాధ్యం” అనే లక్ష్యంతో గ్రామ ప్రజలంతా ఏకమై ఒక్కరోజే 103 మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు కల్పించారు. తెలంగాణ విద్యా చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచిన ఈ కార్యక్రమం ప్రభుత్వ విద్యకు కొత్త ఊపునిచ్చింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నల్లబోయిన నాగార్జున, ఎంఈవో, సీడీపీవో, ప్రభుత్వ వైద్యులు, ఇతర అధికారులు హాజరై గ్రామస్థులను అభినందించారు. కొత్తగా అడ్మిషన్ పొందిన 103 మంది విద్యార్థులకు వెల్కమ్ కిట్లు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

గ్రామస్థుల ఈ చొరవతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలలో విశ్వాసం పెరుగుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకం, మౌలిక వసతుల కల్పన చేపడితే చిన్నబొయినపల్లి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాభివృద్ధికి ఆదర్శ గ్రామంగా నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వం కూడా ఈ ప్రయత్నానికి ప్రోత్సాహం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>