రోబోటిక్ చొరబాటు: నీటి అడుగున చైనా కొత్త ప్లాన్!

కలం, వెబ్ డెస్క్ : చైనా సాంకేతిక పరిజ్ఞానంతో సముద్రంలో స్వయంగా ఈదుతూ రహస్య నిఘా పెట్టే అత్యాధునిక రోబోటిక్ చేపల (China Robotic Fish)ను అభివృద్ధి చేసింది. సాధారణ చేపల తరహాలోనే కదులుతూ నీటిలో కలిసిపోయే ఈ కృత్రిమ పరికరాలను సైనిక అవసరాల కోసం కూడా వినియోగించే అవకాశాలు ఉన్నాయి. నౌకలు, పోర్టులు, సముద్ర ఆధారిత కీలక మౌలిక వసతుల వద్దకు ఇవి ఎవరికీ అనుమానం రాకుండా చేరుకుని రహస్యంగా సమాచారాన్ని సేకరించగలవు.

దీనివల్ల వివిధ దేశాల తీర ప్రాంత భద్రతకు ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇతర దేశాల నౌకాదళ కదలికలను నిరంతరం పసిగట్టేందుకు చైనా ఇలాంటి అటానమస్ వ్యవస్థలను పెద్దమెత్తున రంగంలోకి దించుతోంది. ఈ పరిణామాలతో భవిష్యత్తులో యుద్ధాలు కేవలం సముద్ర ఉపరితలానికే పరిమితం కాకుండా, సముద్రం అడుగు భాగంలోనూ చేరుకునే ప్రమాదం ఉందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>