Mobile Popup Ad
Mobile Popup Ad

చిమిర్యాల పాఠశాలలో అగ్నిప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాల హైస్కూల్‌ (Chimiryala High School)లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాఠశాల ప్రధాన కార్యాలయపు ఆఫీస్ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గది నుండి పెద్ద ఎత్తున పొగలు, మంటలు వ్యాపించడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆఫీస్ గదిలో భద్రపరిచిన విద్యార్థుల కీలక రికార్డులు, విలువైన పుస్తకాలు, పాఠశాల ఫర్నిచర్ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని, అధికారులు ఘటనపై విచారణ జరుపుతున్నారని స్థానికులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>