ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఆదివారం ఉదయం 06.00 గంటల నుండి 09.00 గంటల వరకు మహబూబ్ నగర్ (Mahabubnagar) స్టేడియం కమాన్ – ప్రధాన రోడ్డు కూడలి వద్ద మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో “హ్యాపీ సండే” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల చేత సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు, డాన్స్ ప్రదర్శనలు, మ్యాజిక్ షో, యోగాసనాలు, మిమిక్రీ షో ప్రేక్షకులకు అలరించాయి. సీనియర్ సిటిజన్ల డాన్స్ ప్రదర్శనలు, అలాగే విద్యార్థుల కరాటే ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు స్టాళ్లు ఏర్పాటు చేసి వారు తయారు చేసిన పౌష్టికాహార పదార్థాలు మరియు ఇతర వస్తువులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>