వేరే మార్గాల ద్వారా 70శాతం క్రూడ్ ఆయిల్ సేకరణ : కేంద్రం

కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇండియాలో గ్యాస్ కొరత (LPG Shortage) ఏర్పడ్డ సంగతి తెలిసిందే. గ్యాస్ కొరత, ధరల పెరుగుదల, క్రూడ్ ఆయిల్ (Crude Oil) సరఫరాలపై తాజాగా కేంద్రం స్పందించింది. పెట్రోలియం, గ్యాస్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మీడియాతో మాట్లాడారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇండియాపై పడుతున్న ప్రభావంపైనే అధికారులు నేడు భేటీలో చర్చించినట్టు ఆమె చెప్పారు. హర్మూజ్ కాకుండా ఇతర మార్గాల నుంచి కూడా కార్గోలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.

ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ను (Crude Oil) చాలా మార్గాల్లో సేకరిస్తున్నామని వెల్లడించారు సుజాత శర్మ. ప్రస్తుతం హర్మూజ్ (Stairs of Hormuz) నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారానే 70% క్రూడ్ ఆయిల్ ఇండియాకు వస్తోందన్నారు. కొంత LPG కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని.. ఆస్ట్రేలియా నుంచి కూడా దిగుమతులు అవుతున్నట్టు చెప్పారు. కాకపోతే LNG విషయంలో ఖతార్ చాలా పెద్ద సరఫరాదారుగా ఉండటం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్నారు. ప్రస్తుతం దేశంలో గ్యాస్ కొరత కొంత ఆందోళనగానే ఉందని.. బ్లాక్ మార్కెట్ కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి ధరల్లో భారీ పెరుగుదల ఏమీ లేదని.. బుక్ చేసుకున్న రెండు రోజుల్లోపు ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేస్తున్నట్టు సుజాత శర్మ స్పష్టం చేశారు.

Read Also: డాడీ, మోడీ, చిన్నమోడీపైనే నా పోరాటం.. కవిత కామెంట్స్

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>