చికెన్ ప్రియులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి షాపులు బంద్

కలం, వరంగల్ బ్యూరో: ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్. ఈ వార్త చికెన్ ప్రియులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే జనాలు గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ప్రచారంతో ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా చికెన్ షాపులు కూడా బంద్ కానున్నాయని ప్రకటన రావడం కలకలం రేపుతోంది. పౌల్ట్రీ కంపెనీలు ఇస్తున్న అతి తక్కువ లాభాల మార్జిన్‌‌ కారణంగా చికెన్ షాపులను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

మార్జిన్ లొల్లి?

పౌల్ట్రీ కంపెనీల విధానంపై చికెన్ షాపుల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవట్లేదని చికెన్ వ్యాపారుల ఆవేదన చెందుతున్నారు. గతంలో ఇచ్చే మార్జిన్ కంటే 20 రూపాయలు తక్కువ ఇస్తున్నారని చెప్తున్నారు. రోజు రోజుకు చికెన్ రేటు పెరుగుతుంది కానీ తమకు ఇచ్చే మార్జిన్ తగ్గిస్తున్నారు. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. మార్జిన్ పెంచకపోతే వ్యాపారం చేయలేమని షాపులు మూసివేస్తామని చికెన్ షాప్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో కిలో చికెన్ ధర రూ.320 నుంచి రూ. 340 వరకు ఉంది. మొన్నటి వరకు రూ.380 వరకు విక్రయించారు. ఫలితంగా గిరాకీ తగ్గింది. కిలో చికెన్ తీసుకెళ్లే వారు అర కిలో తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. దీంతో దుకాణదారులు తమ సమస్యలను తెలియజేస్తూ పోస్టర్లను ప్రదర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం కొనసాగించడం ఇకపై లాభదాయకం కాదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని, పౌల్ట్రీ కంపెనీలతో చర్చలు జరపాలని చికెన్ షాప్ వ్యాపారులు కోరుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు దుకాణాలను తిరిగి తెరవబోమని దుకాణ యజమానులు స్పష్టం చేస్తున్నారు.

తగ్గిన గుడ్ల ధరలు:

ఓ పక్క చికెన్ ధరలు చుక్కలు చూపుతుండగా గుడ్ల ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఎగుమతులకు అంతరాయం కలగడంతో గత కొన్ని రోజులుగా గుడ్ల ధరలు తీవ్రంగా పడిపోయాయి. పశ్చిమ ఆసియాకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడమే ఈ క్షీణతకు ప్రధాన కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. హోల్ సేల్ మార్కెట్ లో గుడ్డు ధర రూ. 4.30 పలుకుతుండగా చిల్లర వ్యాపారులు రూ. 5 ధరతో విక్రయిస్తున్నారు. కోళ్ల దాణా ఖర్చు పెరగడం, తగ్గిన ధరలతో నష్టం వస్తోందని లేయర్ ఫామ్ నిర్వాహకులు ఆందోళన చెండుతున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>