కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి

కలం, వెబ్​ డెస్క్​ : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌ (Sambhajinagar)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారును రివర్స్ తీస్తున్న క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం ఒక్కసారిగా పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన వారిని రక్షించేందుకు నీటిలోకి దూకిన ఓ వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో మునిగిపోతున్న డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసి ప్రాణాలతో కాపాడగలిగారు. అయితే మిగిలిన వారిని రక్షించే ప్రయత్నం ఫలించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి (Sambhajinagar) చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read Also: రీల్స్​ పిచ్చి.. హైవేపై డాన్స్​ : యువతులపై కేసు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>