జార్ఖండ్‌లో కుప్ప‌కూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి

క‌లం, వెబ్ డెస్క్‌: జార్ఖండ్‌ (Jharkhand)లో విషాద ఘటన చోటుచేసుకుంది. రాంచీ (Ranchi) నుంచి ఢిల్లీ (Delhi)కి బయలుదేరిన ఓ ఎయిర్ అంబులెన్స్ (Air Ambulance) విమానం సోమవారం రాత్రి ఛ‌త్రా జిల్లాలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఏడుగురు మరణించారు. ఛ‌త్రా జిల్లా సిమారియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్ర‌మాదం జ‌రిగిన మొద‌ట్లో ఒక్క‌రే మృతి చెందినట్లు భావించినా, తర్వాత అధికారులు విమానంలో ఉన్న వాళ్లంద‌రూ చనిపోయినట్లు తెలిపారు. మరణించిన వారిలో పైలట్ కెప్టెన్‌ వివేక్ వికాస్ భగత్, కో పైలట్ కెప్టెన్ సవ్రజ్‌దీప్ సింగ్ ఉన్నారు. అలాగే సంజయ్ కుమార్, అర్చనా దేవి, ధురు కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, పారామెడిక్ సచిన్ కుమార్ మిశ్రా కూడా మృతి చెందారు.

ఈ విమానం (Air Ambulance) రాంచీ నుంచి సోమ‌వారం సాయంత్రం సుమారు 7 గంటలకు బయలుదేరి, రాత్రి 10 గంటల‌కు ఢిల్లీకి చేరాల్సి ఉంది. అయితే ప్రారంభ‌మైన కొద్ది సేప‌టికే కోల్‌కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో ఉన్న సంబంధం తెగిపోయింది. వారణాసికి సౌత్ ఈస్ట్‌లో సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో రాడార్‌ నుంచి కూడా అదృశ్యమైంది. ప్రమాదానికి గురైన విమానం వీటీ ఏజేవీ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉంది. ఇది రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందినది. ఈ విమానాన్ని వైద్య అత్యవసర సేవల కోసం ఉపయోగిస్తున్నారు.

సంజయ్ కుమార్‌కు ప్ర‌మాద‌వ‌శాత్తు 65 శాతం కాలిన గాయాల‌య్యాయి. రాంచీలోని ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. సోమవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి విమానాశ్రయానికి తీసుకెళ్లారు. చికిత్స కోసం వెళ్తుండ‌గా ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం దర్యాప్తు ప్రారంభించింది.

Read Also: మోహ‌న్‌బాబు యూనివ‌ర్సిటీ విద్యార్థిని సూసైడ్‌

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>