కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన వారిని వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్య, భర్త, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు ప్రయాణిస్తున్న చిన్నారి తీవ్ర గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
మృతులు మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన మధు, కుమ్మరి సావిత్రి, వారి కుమారుడిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, బైక్ను ఢీకొట్టి పరారైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

